ipl: ఐపీఎల్ లో నిరాశ పరుస్తున్న సన్ రైజర్స్ కు ట్రోఫీ

Sunrisers lifts SA t20 trophy

  • ఎస్ఏ టీ20 లీగ్ లో విజేతగా నిలిచిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్
  • ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఢిల్లీకి చెందిన ప్రిటోరియా క్యాపిటల్స్ పై గెలుపు
  • ఐడెన్ మార్ క్రమ్ కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు

ఐపీఎల్ లో కొన్నేళ్లుగా నిరాశ పరుస్తున్న సన్ రైజర్స్ జట్టు.. సౌతాఫ్రికా టీ20 లీగ్ (ఎస్ఏటీ 20) తొలి సీజన్ లో అద్భుత ప్రదర్శన చేసింది. ఈ ఏడాదే ఆరంభమైన ఈ టోర్నీలో సన్ రైజర్స్ ఫ్రాంచైజీగా బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజేతగా నిలిచింది. నిన్నరాత్రి జరిగిన ఫైనల్లో ఐడెన్ మార్ క్రమ్ కెప్టెన్సీలోని సన్ రైజర్స్ 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి చెందిన ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టును ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ టీమ్ 19.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. 

కుశాల్ మెండిస్ (21) టాప్ స్కోరర్. సన్ రైజర్స్ బౌలర్లలో వాండర్ మెర్వే నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ 16.2 ఓవర్లలోనే 132/6 స్కోరు చేసి సులువుగా గెలిచింది. ఓపెనర్ ఆడమ్ రొసింగ్టన్ (57) అర్ధ శతకంతో రాణించాడు. మెర్వే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచాడు. టోర్నీలో అద్భుతంగా ఆడిన ఐడెన్ మార్ క్రమ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు.

ipl
sunrisers hyderabad
SA t20 trophy
Sunrisers Eastern Cape
win
  • Loading...

More Telugu News