Subbaraju: నాకు మొహమాటం ఎక్కువ .. డబ్బులు ఎగ్గొట్టినవారు ఎక్కువే: నటుడు సుబ్బరాజు

Subbaraju Interview

  • విలక్షణ నటుడు అనిపించుకున్న సుబ్బరాజు 
  • ఎవరినీ అవకాశాలు అడిగే అలవాటు లేదని వెల్లడి 
  • 'లీడర్' సినిమాలో తన పాత్ర అంటే ఇష్టమని వివరణ 
  • ప్రస్తుతం బిజీగానే ఉన్నానని చెప్పిన సుబ్బరాజు

విలన్ షేడ్స్ తో కూడిన పాత్రలను ఎక్కువగా చేస్తూ తన ప్రయాణాన్ని మొదలెట్టిన సుబ్బరాజు, ఆ తరువాత కేరక్టర్ ఆరిస్టుగా విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ఇంటర్వ్యూలో పాల్గొన్న సుబ్బరాజు, తన గురించిన అనేక విషయాలను ఈ వేదిక ద్వారా పంచుకున్నాడు. 

"స్టార్ డైరెక్టర్స్ అంతా నాకు తెలుసు .. వాళ్లతో చాలా సాన్నిహిత్యం ఉంది. అయినా ఎవరినీ కూడా ఎప్పుడూ నేను వేషం అడగలేదు. నా కోసం మంచి పాత్రలను క్రియేట్ చేయమని చెప్పలేదు. వచ్చిన ప్రతి పాత్రను చేస్తూ వెళ్లమని పూరిగారు నాకు చెప్పారు .. అప్పటి నుంచి అదే పద్ధతిని ఫాలో అవుతున్నాను" అని అన్నాడు. 

"మొదటి నుంచి కూడా నాకు మొహమాటం ఎక్కువ. అందువలన ఎవరినీ పారితోషికం విషయంలో ఇబ్బంది పెట్టేవాడిని కాదు. దాంతో డబ్బులు ఎగ్గొట్టినవారే ఎక్కువ. ఓ 60 .. 70 చెల్లని చెక్కులు మొన్న మొన్నటివరకూ నా దగ్గరే ఉండేవి. నేను ఇంతవరకూ చేసిన పాత్రలలో నాకు 'లీడర్' సినిమాలోని పాత్ర ఇష్టం. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో నేను బిజీగానే ఉన్నాను" అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. 

Subbaraju
Actor
Open Heart With RK
  • Loading...

More Telugu News