Subbaraju: హీరో పాత్రలవైపు వెళ్లకపోవడానికి ఓ కారణం ఉంది: నటుడు సుబ్బరాజు

Subbaraju Interview

  • నటుడిగా ఎదుగుతూ వచ్చిన సుబ్బరాజు
  • కెరియర్ ఆరంభంలో చిన్న రూమ్ లో మకామ్  
  • 'ఆర్య' నుంచి పారితోషికం పెరిగిందని వెల్లడి
  • హీరోగా చేయడమనేది పెద్ద బాధ్యతని వ్యాఖ్య

తెలుగు తెరపై నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలతో పాటు, కామెడీ టచ్ తో కూడిన విలనిజం కూడా చేయగలనని నిరూపించుకున్న నటుడుగా సుబ్బరాజు కనిపిస్తాడు. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' షోలో ఆయన మాట్లాడుతూ .. భీమవరం కాలేజ్ లో డిగ్రీ పూర్తిచేశాననీ, కంప్యూటర్స్ కి సంబంధించిన ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చాననీ అన్నారు . 

"అలా హైదరాబాద్ లో ఉండగా అనుకోకుండా కృష్ణవంశీ గారి 'ఖడ్గం' సినిమాలో ఛాన్స్ వచ్చింది. దాంతో సినిమాల వైపు వచ్చేశాను. ఆరంభంలో వేషాలు పెద్దగా రాలేదు. అందువలన 'నల్లకుంట'లోని ఒక సింగిల్ రూమ్ లో ఫ్రెండ్స్ తో కలిసి ఉండేవాడిని. 'ఆర్య' సినిమాకి గాను ఫస్టు టైమ్ 2 లక్షలు పారితోషికంగా తీసుకున్నాను" అని చెప్పాడు. 

'యోగి' సినిమా షూటింగులో చిన్న ప్రమాదం ఒకటి జరిగింది. అప్పటి నుంచి ఫిట్ నెస్ పై ఎక్కువగా దృష్టిపెడుతూ వచ్చాను. 'హీరో వేషాలు వేయవచ్చుగదా?' అని నాతో చాలామంది ఉన్నారు. హీరోగా చేస్తే ఒక ప్రాజెక్టు మొత్తం బరువును మనమే మోయవలసి ఉంటుంది. అంతటి బాధ్యత తీసుకోవడమంటే నాకు భయం .. అందువలన అటువైపు దృష్టి పెట్టలేదు" అని చెప్పుకొచ్చాడు. 

Subbaraju
Actor
Open Heart With RK
  • Loading...

More Telugu News