Venkaiah Naidu: అమరావతిపై నా అభిప్రాయం ఇంతకుముందే చెప్పాను: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu opines on AP Capital

  • భీమవరంలో ఓ కార్యక్రమానికి హాజరైన వెంకయ్య
  • ఏపీ రాజధానిపై ప్రశ్నించిన ఆర్కేఆర్ కాలేజి విద్యార్థిని
  • వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనన్న మాజీ ఉపరాష్ట్రపతి
  • రాజధాని ఏర్పాటు ప్రజాభిప్రాయం ప్రకారమే జరగాలని వెల్లడి

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్కేఆర్ కాలేజీ విద్యార్థిని ఏపీ రాజధాని అంశంపై వెంకయ్యనాయుడిని ప్రశ్నించింది. అందుకు ఆయన బదులిస్తూ... ఈ వ్యవహారంలోని వివాదాస్పద అంశాల జోలికి వెళ్లబోనని స్పష్టం చేశారు. 

అయితే, రాజధాని ఏర్పాటు ప్రజాభిప్రాయం ప్రకారం జరగాలని అభిప్రాయపడ్డారు. అమరావతిపై తన అభిప్రాయం గతంలోనే చెప్పానని వెంకయ్యనాయుడు అన్నారు. 

కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ప్రధానితో కలిసి శంకుస్థాపనలో పాల్గొన్నానని వెల్లడించారు. కేంద్రమంత్రి హోదాలో అమరావతి అభివృద్ధికి నిధులు కూడా మంజూరు చేశానని వివరించారు. నా అభిప్రాయం ఏంటో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అని రాజధానిపై తన మనోభావాలను పంచుకున్నారు.

More Telugu News