Varun Tej: వరుణ్ తేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఎంతవరకూ వచ్చిందంటే ..!

Gandeevadhari Arjuna Movie Update

  • 'గాండీవధారి అర్జున'గా వరుణ్ తేజ్ 
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ 
  • యూరప్ లో జరగనున్న షూటింగు 
  • హీరోయిన్ గా అలరించనున్న సాక్షి వైద్య 
  • ప్రతినాయకుడిగా కనిపించనున్న వినయ్ రాయ్


వరుణ్ తేజ్ 12వ సినిమా ప్రస్తుతం షూటింగు జరుపుకుంటోంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. క్రితం ఏడాది అక్టోబర్ లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. అప్పటి నుంచి కూడా భారీ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ ముందుకు వెళుతున్నారు. 

ఈ సినిమాకి 'గాండీవధారి అర్జున' అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు యూకేలో జరుగుతోంది. భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ అనంతరం, అక్కడి షెడ్యూల్ ను పూర్తిచేశారు. అక్కడి లొకేషన్ కి సంబంధించిన ఫొటోలను తాజాగా వదిలారు. 

తదుపరి షెడ్యూల్ ను యూరప్ లో ప్లాన్ చేశారు. అక్కడి లొకేషన్స్ లో మరికొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి టీమ్ రెడీ అవుతోంది. 'ఏజెంట్' సినిమాలో అఖిల్ తో కలిసి నటించిన 'సాక్షి వైద్య'నే ఈ సినిమాలో హీరోయిన్. ప్రతినాయకుడిగా వినయ్ రాయ్ కనిపించనున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా, ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Varun Tej
Sakshi Vaidya
Gandeevadhari Arjuna Movie
  • Loading...

More Telugu News