Dhanush: 'సార్' కథ వినగానే ధనుశ్ ఒక్కటే ఒక మాటన్నారు: వెంకీ అట్లూరి  

Venky Atluri Interview

  • వెంకీ అట్లూరి నుంచి వస్తున్న 'సార్'
  • ధనుశ్ సరసన సందడి చేయనున్న సంయుక్త మీనన్ 
  • బాణీలను అందించిన జీవీ ప్రకాశ్ కుమార్ 
  • ఈ నెల 17వ తేదీన విడుదలవుతున్న సినిమా 


ప్రేమకథా చిత్రాలలో తన ప్రత్యేకతను చాటుకున్న వెంకీ అట్లూరి, తన తాజా చిత్రంగా 'సార్' సినిమాను రూపొందించాడు. సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. సంయుక్త మీనన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ .. "ధనుశ్ నేరుగా తెలుగులో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. ఆ సమయంలోనే నేను ఆయనకి కథను వినిపించాను. ధనుశ్ కథకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ముందుగా ఆయన స్క్రిప్ట్ మాత్రం అడుగుతారు. అది ఆయనకి ఇస్తే సరిపోతుంది" అని అన్నారు. 

"ధనుశ్ కి కథ నచ్చితే చాలు .. ఆ దర్శకుడు ఇంతకుముందు ఏం తీశాడు? ఇప్పుడు ఏ భాషలో చేస్తాడు? అనేది కూడా ఆయన పట్టించుకోరు. నేను ఇచ్చిన స్క్రిప్ట్ చదివిన తరువాత 'డేట్స్ ఎప్పుడు కావాలి?' అన్నారు. ఆయన అంత త్వరగా ఒప్పుకుంటాడని నేను అనుకోలేదు. అందువల్లనే షాక్ అయ్యాను" అంటూ చెప్పుకొచ్చారు. 

Dhanush
Samyuktha Menon
Sir Movie
  • Loading...

More Telugu News