Telangana: తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం 17న కాదు.. కారణం ఇదే!

Telangana New Secretariat Inauguration postponed
  • తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
  • కోడ్ అమల్లో ఉండడంతో ప్రారంభోత్సవం వాయిదా
  • త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామన్న ప్రభుత్వం
ఈ నెల 17న తలపెట్టిన తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతోనే ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్టు ప్రభుత్వం తెలిపింది. కొత్త సచివాలయాన్ని మళ్లీ ఎప్పుడు ప్రారంభించేదీ త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. 

తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాలు కలిపి మొత్తం 13, తెలంగాణలో ఒక్కో ఉపాధ్యాయ, స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ప్రస్తుతం ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది.
Telangana
TS Secretariat
MLC Elections

More Telugu News