Dr BR Ambedkar: అంబేద్కర్ బతికి ఉంటే చంపేసేవాడినంటూ సోషల్ మీడియాలో పోస్ట్.. తెలంగాణ వ్యక్తికి అరదండాలు!

 Telengana man arrested after video sparks row On Ambedkar
  • అంబేద్కర్‌ను అవమానిస్తూ సోషల్ మీడియాలో వీడియో
  • గాంధీని గాడ్సే చంపినట్టు తాను అంబేద్కర్‌ను చంపేసేవాడినంటూ వ్యాఖ్యలు
  • కఠిన చర్యలు తీసుకోవాలన్న బీఎస్పీ తెలంగాణ చీఫ్ ప్రవీణ్ కుమార్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానిస్తూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన వ్యక్తికి తెలంగాణ పోలీసులు అరదండాలు వేశారు. నిందితుడిని హమారా ప్రసాద్‌గా గుర్తించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ కనుక బతికి ఉంటే తాను ఆయనను చంపేసి ఉండేవానని అన్నాడు. గాంధీని గాడ్సే కాల్చి చంపినట్టు తాను అంబేద్కర్‌ను హత్య చేసేవాడినని పేర్కొన్నాడు. అంబేద్కర్ రాసిన పుస్తకాన్ని పట్టుకుని చూపిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశాడు. 

సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ కావడంతో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు నిన్న అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
Dr BR Ambedkar
Telangana
Hamara Prasad
Viral Videos

More Telugu News