Revanth Reddy: పెయింట్లు వేసుకునే రేవంత్ రెడ్డి వేల కోట్లు ఎలా సంపాదించారు?: మాజీ మంత్రి రెడ్యానాయక్‌

Redya Nayak fires on Revanth Reddy

  • హైదరాబాద్ లో భూముల కోసమే పార్టీ మారాడన్న రేవంత్ రెడ్డి
  • నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రెడ్యానాయక్
  • హైదరాబాద్ లో ఒక్క సెంటు భూమి కూడా లేదని వ్యాఖ్య

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి రెడ్యానాయక్ మండిపడ్డారు. హైదరాబాద్ లో భూముల కోసమే తాను పార్టీ మారినట్టు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తనకు కానీ, తన కూతురుకు కానీ హైదరాబాద్ లో ఒక్క సెంటు భూమి కూడా లేదని అన్నారు. గతంలో కొంత భూమి ఉండేదని, దాన్ని అమ్మేశామని చెప్పారు. 

హైదరాబాద్ లో తనకు భూమి ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఒకవేళ నిరూపించకుంటే రేవంత్ రెడ్డి పది చెప్పు దెబ్బలు తింటాడా? అని ప్రశ్నించారు. తన నిజాయతీ ఏమిటో డోర్నకల్ ప్రజలకు తెలుసని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ భ్రష్టు పట్టించారని విమర్శించారు. గోడలకు రంగులేసుకునే రేవంత్ రెడ్డి ఇప్పుడు వేల కోట్లకు ఎలా పడగలెత్తారని ప్రశ్నించారు.

Revanth Reddy
Congress
Redya Nayak
TRS
  • Loading...

More Telugu News