Rohit Sharma: ఇంతవరకు ఏ ఇండియన్ కెప్టెన్ సాధించని రికార్డును సొంతం చేసుకున్న రోహిత్ శర్మ

Rohit Sharma record as captain

  • మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఏకైక ఇండియన్ కెప్టెన్ గా రోహిత్ ఘనత
  • ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనత సాధించిన నాలుగో కెప్టెన్
  • ధోనీ, కోహ్లీలకు కూడా సాధ్యం కాని రికార్డు  

మన దేశ క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కు సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ గా టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఘనతను సాధించాడు. భారత కెప్టెన్లలో మరెవరూ ఈ ఘనతను సాధించలేదు. కెప్టెన్ గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఘనతను ఇప్పటి వరకు ముగ్గురు కెప్టెన్లు సాధించారు. వీరిలో శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఉన్నారు. ఇప్పుడు వీరి సరసన రోహిత్ శర్మ చేరాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో సెంచరీ సాధించడం ద్వారా ఆయన ఈ ఘనతను సాధించాడు. ధోనీ, గంగూలీలకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు.

Rohit Sharma
Record
Team India
  • Loading...

More Telugu News