Amit Shah: నేడు హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా

Amit Shah coming to Hyderabad

  • రాత్రి 10.15 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా
  • నేరుగా పోలీస్ అకాడమీకి చేరుకోనున్న కేంద్ర హోం మంత్రి
  • రేపు ట్రైనీ ఐపీఎస్ ల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొననున్న అమిత్ షా

తెలంగాణలో రాజకీయాలు మంచి వేడి మీద ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే ఎన్నికల సందడి మొదలయిందని చెప్పుకోవచ్చు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముందుకు సాగుతున్నాయి. ఎత్తులు, పైఎత్తులు వేస్తూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు విచ్చేస్తున్నారు. రాత్రి 10.15 గంటలకు ఆయన భాగ్యనగరికి చేరుకోనున్నారు. అనంతరం రోడ్డుమార్గంలో బయల్దేరి రాత్రి 10.40 గంటలకు ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. 

రేపు ఉదయం పోలీస్ అకాడమీలో నిర్వహించే ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో కేంద్ర హోం మంత్రి పాల్గొంటారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7.50 గంటల నుంచి 10.30 గంటల వరకు కొనసాగుతుంది. ఈ పరేడ్ లో 195 మంది ట్రైనీ ఐపీఎస్ లతో పాటు... 29 మంది విదేశీ ట్రైనీ ఆఫీసర్లు పాల్గొంటారు. పరేడ్ ముగిసిన తర్వాత 11 నుంచి 12 గంటల వరకు పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమవుతారు. అనంతరం 1.25 గంటలకు ఆయన ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటన పూర్తిగా అధికారిక కార్యక్రమంగానే కొనసాగనుంది. ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు లేకపోవడం గమనార్హం.

Amit Shah
BJP
Hyderabad
  • Loading...

More Telugu News