Karnataka: ‘ఆవిడా మా ఆవిడే’.. అనుకుని బైక్ ఎక్కించుకున్నాడు.. సీన్ కట్ చేస్తే..!

biker mistakenly ride with another woman in Karnataka
  • కర్ణాటకలోని హవేరి జిల్లాలో విచిత్ర ఘటన
  • భర్తనుకుని పొరబడి వేరే వ్యక్తి బైక్ ఎక్కేసిన మహిళ
  • తన భార్యలాంటి చీర కట్టుకోవడంతో తన భార్యే అనుకున్న బైకర్
  • సగం దూరం వెళ్లాక తెలిసిన అసలు నిజం
  • తిరిగి పెట్రోలు బంకుకు.. పగలబడి నవ్వుకున్న జనం
కొన్ని ఘటనలు సినిమాల్లో మాత్రమే జరుగుతాయని అనుకుంటాం. అయితే, అది నిజం కాదు.. నిజ జీవితంలోనూ అలాంటివి జరుగుతాయని నిరూపించిందీ ఘటన. తన భార్యే అనుకుని బైక్ ఎక్కమంటే.. తన భర్తే అనుకుని ఆమె బైక్ ఎక్కేసింది. ఆ తర్వాత విషయం తెలిసి ఇద్దరూ గతుక్కుమన్నారు. కర్ణాటకలోని హవేరీ జిల్లా రాణెబెన్నూరులో జరిగిందీ ఘటన. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భార్యతో కలిసి వెళ్తున్న ఓ వ్యక్తి బైక్‌లో పెట్రోలు పోయించుకునేందుకు బంకుకు వెళ్లాడు. పెట్రోలు పోయించుకున్న తర్వాత తన భార్యను బండెక్కమన్నాడు. ఆవిడ ఎక్కేసింది. ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక అనుమానం వచ్చిన ఆమె.. మన ఇల్లు ఇటు కాదు కదా.. ఇటెందుకు వెళ్తున్నారు? అని ప్రశ్నించింది. దీంతో బిత్తరపోయిన ఆయన హెల్మెట్ తీసి వెనక్కి తిరిగి చూస్తే ఆవిడ వాళ్లావిడ కాదు. ఆమె కూడా అతడిని చూసి నాలుక్కరుచుకుంది. 

దీంతో బైక్‌ను వెంటనే వెనక్కి తిప్పిన ఆయన ఆమెతో కలిసి పెట్రోలు బంకుకు చేరుకున్నాడు. అక్కడ వాళ్లావిడ, ఆమె భర్త వీరి కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?.. పెట్రోలు పోయించుకున్న తర్వాత తన భార్యలాంటి చీరే కట్టుకున్న ఆమెను అతడు బండెక్కమన్నాడు. తన భర్తలాంటి బైక్, అదే ఒడ్డూపొడుగు, తన భర్త ధరించిన లాంటి హెల్మెట్ ఉండడంతో తన భర్తే అనుకుని ఆమె బండి ఎక్కేసింది. అతడు కూడా ఆమె తన భార్యే అనుకుని బైక్‌పై దూసుకుపోయాడు.. అదన్నమాట సంగతి. విషయం తెలిసిన అందరూ పగలబడి నవ్వుకున్నారు.
Karnataka
Haveri
Bike
Off Beat Story

More Telugu News