Twitter: ట్విట్టర్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ రూ.900.. ప్రత్యేక ఫీచర్లు
- భారత్ లో నెలవారీ చందా మొదలు
- పెద్ద సైజు ట్వీట్లు, వీడియోలు పోస్ట్ చేసుకోవచ్చు
- ఐదు సార్లు వరకు ఎడిట్ చేసుకునే ఆప్షన్
ట్విట్టర్ తన చందాదారుల కోసం భారత్ లో బ్లూ టిక్ సేవలు మొదలు పెట్టింది. మొబైల్ యాప్ యూజర్లు నెలకు రూ.900 చెల్లించి తమ ప్రొఫైల్ కోసం బ్లూ టిక్ మార్క్ పొందొచ్చు. వెబ్ సైట్ వెర్షన్ కోసమే అయితే నెలకు రూ.650 చార్జీ చెల్లిస్తే సరిపోతుంది. చందా చెల్లించిన అనంతరం వారి ప్రొఫైల్ వద్ద బ్లూటిక్ మార్క్ కనిపిస్తుంది. నిజమైన ప్రొఫైల్ అని చెప్పేందుకు ఇది ధ్రువీకరణగా పనిచేస్తుంది. వార్షిక సబ్ స్క్రిప్షన్ కసం మొబైల్ వినియోగదారులు రూ.7,800కు బదులు రూ.6,800 చెల్లిస్తే చాలు.