Kiran Abbavaram: నన్ను కంగారుపెట్టే విషయం అదొక్కటే: హీరో కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram Interview

  • వరుస సినిమాలతో బిజీగా కిరణ్ అబ్బవరం 
  • ఈ నెల 17న 'వినరో భాగ్యము విష్ణు కథ' రిలీజ్ 
  • తనని గైడ్ చేసేవారు లేరని వెల్లడి 
  • పెద్ద బ్యానర్లలో రెండు సినిమాలు చేస్తున్నానంటూ హర్షం  

కిరణ్ అబ్బవరం హీరోగా ఎదుగుతున్నాడు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా, ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వినరో భాగ్యము విష్ణు కథ' రెడీ అవుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడుతూ .. "కాలేజ్ రోజుల నుంచి నేను సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. సినిమాలకి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తిని కనబరిచేవాడిని. బయట నుంచి మనం చూసే సినిమా ప్రపంచం వేరనే విషయం ఇక్కడికి వచ్చిన తరువాతనే అర్థమైంది" అన్నాడు. 

"ఇక్కడ నేను ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఎందుకంటే నేను ఏదైనా తప్పు చేస్తుంటే కరెక్టు చేసేవారు లేరు .. గైడ్ చేసేవారు లేరు. ఈ విషయమే నన్ను కంగారు పెడుతుంటుంది. అందువలన ఎక్కడా ఏది తేడా కొట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను. ప్రస్తుతం మైత్రీ బ్యానర్లో ఒకటి .. ఎ.ఎమ్. రత్నం బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Kiran Abbavaram
Bunny Vasu
Vinaro Bhagyamu Vishnu Katha Movie
  • Loading...

More Telugu News