Hyderabad: హైదరాబాదీలను అలరించనున్న డబుల్ డెక్కర్ బస్సులు

Double decker bus in Hyderabad

  • భాగ్యనగరంలో మళ్లీ రోడ్డెక్కుతున్న డబుల్ డెక్కర్ బస్సులు
  • నెక్లెస్ రోడ్ ఏరియాలో తిరగనున్న బస్సులు
  • ఈ నెల11 నుంచి సర్వీసుల ప్రారంభం

ఇప్పుడున్న వారిలో డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన ఆ గొప్ప అనుభూతి కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. డబుల్ డెక్కర్ బస్సులు ఎలా ఉంటాయో చాలా మందికి తెలియదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మళ్లీ మన హైదరాబాద్ రోడ్లలో డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. ఈరోజు మూడు డబుల్ డెక్కర్ బస్సులను హైదరాబాద్ లో ప్రారంభించారు. మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను కేటీఆర్, సీఎస్ శాంతికుమారి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులు ఈ నెల 11 నుంచి ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజ్ స్ట్రెచ్ లను కవర్ చేస్తూ తిరుగుతాయి. నగరంలో టూరిజంను పెంపొందించేలా ఈ బస్సులను నడపనున్నారు. 

Hyderabad
Double Dekker Bus
  • Loading...

More Telugu News