Kiran Abbavaram: అల్లు అరవింద్ గారు నాకు అడ్వాన్స్ ఇచ్చి పదేళ్లు అయింది: హరీశ్ శంకర్

Vinaro Bhagyamu Vishnu katha Trailer Release Event

  • 'వినరో భాగ్యము విష్ణుకథ' టైటిల్ నచ్చిందన్న హరీశ్ శంకర్
  • కిరణ్ అబ్బ్బవరం అందరి హీరో అని అభినందనలు 
  • గీతా ఆర్ట్స్ లో సినిమా చేయాలనుందని వ్యాఖ్య 
  • అల్లు అరవింద్ మాట కోసం వెయిటింగ్ అని వెల్లడి

కిరణ్ అబ్బవరం హీరోగా .. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో నిర్మితమైన 'వినరో భాగ్యము విష్ణు కథ' ఈ నెల 10వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంటులో హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. "ఈ సినిమా టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే హీరో కిరణ్ అబ్బవరం కూడా. ప్రతి ఇంట్లో ఉండే హీరో మాదిరిగా అతను కనిపిస్తాడు" అన్నారు.  

"గీతా ఆర్ట్స్ 2 నాకు హోమ్ బ్యానర్ .. కానీ ఇంతవరకూ ఈ బ్యానర్లో నేను సినిమా చేయలేదు. 'గబ్బర్ సింగ్' తరువాత నాకు అడ్వాన్స్ ఇచ్చారు .. ఈ రోజు వరకూ సినిమా ఎప్పుడు? అని అడగలేదు. నేను గుర్తు చేస్తే .. మంచి సినిమా అనుకున్నప్పుడు తప్పకుండా కలిసి చేద్దాం అని అంటున్నారు" అని చెప్పారు. 

"అల్లు అరవింద్ గారు ఇలాంటి సినిమా ఫంక్షన్స్ కి పిలిచినప్పుడల్లా .. ఈసారి నా సినిమా గురించి ఏమైనా మాట్లాడతారేమోనని అనుకుంటాను. ఆయన సినిమాను గురించి మాట్లాడతారు .. కాకపోతే ఏ సినిమా ఫంక్షన్ కి పిలిచారో ఆ సినిమాను గురించి మాత్రమే మాట్లాడతారు" అంటూ నవ్వేశారు.  

Kiran Abbavaram
Bunny Vasu
Harish Shankar
  • Loading...

More Telugu News