Chandrababu: తమిళనాడు చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు లేఖ

Chandrababu wrote Tamilnadu CS

  • కుప్పం నుంచి గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతోందన్న చంద్రబాబు
  • తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపణ 
  • చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరిన వైనం
  • సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని సూచన

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. కుప్పం నుంచి తమిళనాడుకు గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. కుప్పం సరిహద్దులోని నడుమూరు నుంచి కృష్ణగిరికి, కొత్తూరు ద్వారా వేపనపల్లికి, మోట్లచేను నుంచి వేలూరుకు గ్రానైట్ తరలిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. గ్రానైట్ అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టాలని సూచించారు.

Chandrababu
CS
Tamilnadu
Granite
Kuppam
Chittoor District
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News