Kiran Abbavaram: సాయితేజ్ చేతుల మీదుగా 'వినరో భాగ్యము విష్ణు కథ' ట్రైలర్ రిలీజ్!

Vinaro Bhagyamu Vishnu katha Trailer Release Event

  • గీతా ఆర్ట్స్ 2 నుంచి 'వినరోభాగ్యము విష్ణుకథ'
  • తిరుపతి నేపథ్యంలో నడిచే కథాకథనాలు 
  • అందమైన బాణీలను అందించిన చైతన్ భరద్వాజ్ 
  • ఈ నెల 17వ తేదీన సినిమా విడుదల

కిరణ్ అబ్బవరం హీరోగా 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమాకి , మురళీ కిషోర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కిరణ్ జోడీగా కశ్మీర పరదేశి అలరించనుంది. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి బాణీలను సమకూర్చాడు. 

కొంతసేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంటును నిర్వహించారు. అల్లు అరవింద్ .. బన్నీ వాసు .. హరీశ్ శంకర్ .. మారుతి .. తదితరులు హాజరయ్యారు. చీఫ్ గెస్టుగా వచ్చిన హీరో సాయితేజ్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. హిరోయిన్ తో హీరో లవ్ .. ఆమె తండ్రితో కామెడీ .. విలన్ గ్యాంగ్ తో యాక్షన్ అంశాలు కలగలిసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.  

ఇది తిరుపతి నేపథ్యంలో నడిచే కథ. ఇంతవరకూ వదిలిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఎంతవరకూ యూత్ కి కనెక్ట్ అవుతుందనేది చూడాలి. మురళీ శర్మ .. శుభలేఖ సుధాకర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

Kiran Abbavaram
Kashmira paradeshi
Vinaro Bhagyamu Vishnukatha Movie

More Telugu News