Allu Arjun: అల్లు అర్జున్ కు ఊహించని కానుక

Surprise gift for Allu Arjun

  • పుష్పలో లారీ నడిపిన అల్లు అర్జున్
  • అలాంటి లారీ బొమ్మనే కానుకగా ఇచ్చిన తనయుడు అయాన్
  • సంతోషంతో పొంగిపోయిన బన్నీ

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో అల్లు అర్జున్ నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక అసలు విషయానికొస్తే, అల్లు అర్జున్ కు ఊహించని కానుక లభించింది. 

పుష్పలో అల్లు అర్జున్ ఓ లారీ నడుపుతూ ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఇప్పుడు అలాంటిదే ఓ చిన్న లారీ బొమ్మను అల్లు అయాన్ తన తండ్రికి బహూకరించడం విశేషం. తనయుడి నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ అందుకున్న బన్నీ ఆనందం అంతాఇంతా కాదు. 

పట్టరాని సంతోషంతో పొంగిపోయిన బన్నీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. నా ముద్దుల కన్న, నా చిన్ని బాబు అయాన్ నుంచి అందిన అందమైన బహుమతి అంటూ అల్లు అర్జున్ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. అంతేకాదు, తనయుడు కానుకగా ఇచ్చిన బొమ్మ లారీ ఫొటోను కూడా పంచుకున్నారు.

Allu Arjun
Ayan
Gift
Lorry
Pushpa
Tollywood
  • Loading...

More Telugu News