Vani Jayaram: అప్పటి నుంచి వాణీజయరామ్ కి హిందీలో అవకాశాలు తగ్గాయట!

Vani jayaram Interview

  • గాయనీమణులలో వాణీ జయరామ్ స్థానం ప్రత్యేకం 
  • హిందీలో వరుస పాటలు పాడిన గాయని 
  • ఆ తరువాత కాలంలో తగ్గిన అవకాశాలు 
  • ఉత్తర భాషల్లోను తన ప్రత్యేకతను చాటుకున్న వాణీజయరామ్ 
  • మంచి ఆర్ట్ తో పాటు మంచి హార్ట్ ఉండాలనేది ఆమె మాట  

ఒక వైపున బాలీవుడ్ లో లతా మంగేష్కర్ .. మరో వైపున తెలుగులో సుశీల - జానకి వంటి గాయనీమణుల జోరు కొనసాగుతున్న సమయంలో తనదైన ప్రత్యేకమైన స్వరాన్ని వినిపించిన గాయనిగా వాణీ జయరామ్ కనిపిస్తారు. అలాగే తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో అక్కడి గాయనీమణులు ఉన్నప్పటికీ 11 ఏళ్లపాటు నెంబర్ వన్ సింగర్ గా అక్కడ గౌరవమర్యాదలు అందుకున్న ఘనత ఆమె సొంతం. అలాంటి వాణీ జయరామ్ హఠాన్మరణం ఆమె అభిమానులను కలచివేస్తోంది. 

వాణీ జయరామ్ కి మొదటి నుంచి హిందీ పాటలంటే ఇష్టం. అందువల్లనే గాయనిగా తన కెరియర్ ను హిందీ పాటతోనే ఆమె మొదలుపెట్టారు. ఆ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " హిందీలో నేను చాలా బిజీ సింగర్ గా ఉండేదానిని. నాకు రావలసిన పాటలు నాకు వచ్చేవి. ఒకసారి లతా మంగేష్కర్ గారి ఇంట్లో అక్కడి ప్లే బ్యాక్ సింగర్స్ తో మీటింగ్ జరిగింది. ఆ తరువాత నుంచి నాకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఫలానావారు కారణమని నేను ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు .. ఇప్పుడు కూడా ఆ విషయం వదిలేద్దాం" అన్నారు.

"అప్పట్లో హిందీ పాటలను ఒక మ్యూజికల్ నైట్ లో పాడటానికి మద్రాసు వచ్చాను. ఆ సమయంలోనే నాకు తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. తెలుగులో 'అభిమానవంతులు' సినిమాలో 'ఎప్పటివలె కాదురా' అనే పాటతో నన్ను ఎస్పీ కోదండపాణిగారు పరిచయం చేశారు. తెలుగులో పాడిన పాటలు తక్కువే అయినా, అవన్నీ సూపర్ హిట్ కావడం నా అదృష్టం. మంచి ఆర్ట్ తో పాటు మంచి హార్ట్ కూడా ఉండాలనేది నేను ఎప్పుడూ చెప్పేమాట" అని అన్నారు.

Vani Jayaram
Singer
Interview
  • Loading...

More Telugu News