KA Paul: నేను, దేవుడు వద్దనుకున్నాం.. అందుకే సచివాలయం కాలిపోయింది: కేఏ పాల్

KA Paul told the reason behind fire accident in secretariat
  • సచివాలయాన్ని చూసేందుకు వెళ్లకుండా తనను అడ్డుకున్నారన్న పాల్
  • దేవుకు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారని వ్యాఖ్య
  • ఈసారి కేసీఆర్ సీఎంగా గెలవలేరని జోస్యం
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణంలో ఉన్న సచివాలయాన్ని చూసేందుకు తాను వెళ్తానంటే వద్దన్నారని ఆయన మండిపడ్డారు. సచివాలయం వద్దని తాను అనుకున్నానని, దేవుడు కూడా అనుకున్నాడని... అందుకే సచివాలయం కాలిపోయిందని చెప్పారు. దేవుడు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పారు. 

ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూడా గెలవలేరని, అలాంటి వ్యక్తి ప్రధాని అవుతారా? అని ఎద్దేవా చేశారు. కొత్త సచివాలయాన్ని కేసీఆర్ పుట్టినరోజున కాకుండా అంబేద్కర్ పుట్టినరోజున ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లకుండా తనను అడ్డుకున్నారని... తనను తెలంగాణ నుంచి బహిష్కరిద్దామనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.
KA Paul
KCR
BRS
Secretariat

More Telugu News