Shubman Gill: చహల్ ముందు కోపంతో గిల్ ను కొట్టేసిన ఇషాన్ కిషన్.. సరదా వీడియో ఇదిగో!

Shubman Gill Ishan Kishan Yuzvendra Chahal recreate rodies
  • ఎంటీవీ రోడీస్ ఆడిషన్ ను రీక్రియేట్ చేసిన ముగ్గురు ఆటగాళ్లు
  • సరదా వీడియోను షేర్ చేసిన గిల్
  • ఈ నెల 9 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్టు
టీమిండియా క్రికెటర్లు శుభ్ మన్ గిల్ పై వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. హోటల్ గదిలో కోపంతో ఊగిపోతూ అతనిపై దాడి చేశాడు. చెంపలు వేసుకోవాలని చెప్పాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర వీళ్ల గొడవను చూస్తూ ఉండిపోయాడు. ఇదంతా సీనియస్ గా జరిగింది కాదు. క్రికెటర్లు కాలక్షేపం కోసం చేశారు. మంచి స్నేహితులైన గిల్, ఇషాన్ పాప్యులర్ యూత్ షో ఎంటీవీ రోడీస్ ఆడిషన్ ఎపిసోడ్ ను రీ క్రియేట్ చేశారు. దీనికి చహల్ దర్శకత్వం చేయగా.. గిల్, ఇషాన్ నటించారు. 

ఇక ఇషాన్ గొరిల్లాలా నడుస్తూ గిల్ పై నుంచి దూకాడు. అయితే, సరిగ్గా నటించలేదంటూ గిల్ ను తిడుతూ, అతడిని కొట్టినట్టు నటించాడు. చెంపలు వేసుకోవాలని కూడా చెప్పాడు. అతను చెప్పినట్టే గిల్ అమాయకంగా చెంపలు వేసుకున్నాడు. ఈ సరదా వీడియోను గిల్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇప్పుడిది వైరల్ గా మారింది. కాగా, న్యూజిలాండ్ తో వన్డే, టీ20 సిరీస్ లను భారత్ గెలిచింది. ఇందులో శుభ్ మన్ గిల్ రెండు సెంచరీలు, డబుల్ సెంచరీతో సత్తా చాటగా.. ఇషాన్ కిషన్ నిరాశ పరిచాడు. ఇదిలావుంచితే, ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి 9వ నాగ్ పూర్ లో తొలి టెస్టు మొదలవనుంది.
Shubman Gill
Ishan Kishan
Chahal
video
Team India

More Telugu News