Narendra Modi: విశ్వనాథ్ సినీ ప్రపంచంలోనే ఒక దిగ్గజం: మోదీ

PM Modi pays condolences to K Vishwanath

  • విశ్వనాథ్ మృతిపై మోదీ దిగ్భ్రాంతి
  • బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారని కితాబు
  • కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ప్రధాని

ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ మృతి పట్ల ప్రధాని మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు. సినీ ప్రపంచంలో విశ్వనాథ్ ఒక దిగ్గజమని కొనియాడారు. సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీ లోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారని అన్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. ఈ మేరకు మోదీ తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ట్వీట్ చేశారు.

Narendra Modi
BJP
K Vishwanath
Tollywood

More Telugu News