Kodali Nani: అలాంటి పనులు చేయడం చంద్రబాబుకే అలవాటు: కొడాలి నాని

Kodali Nani comments on Kotamreddy

  • ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్న నాని 
  • కోటంరెడ్డిలాంటి వారు పార్టీ నుంచి వెళ్తేనే మంచిదని వ్యాఖ్య 
  • జగన్ కు నమ్మకం తప్ప అనుమానాలు ఉండవని కితాబు 

సొంత పార్టీనే తన ఫోన్ ను ట్యాపింగ్ చేసిందని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. అలాంటి పనులు చేయడం చంద్రబాబుకే అలవాటని అన్నారు. జగన్ వల్లే తనకు పదవి వచ్చిందని కోటంరెడ్డి ఎన్నో సార్లు చెప్పారని తెలిపారు. 

కోటంరెడ్డికి చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేసినట్టున్నారని... పార్టీ మారాలనుకున్నారు కాబట్టే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారు పార్టీ నుంచి పోతేనే మంచిదని చెప్పారు. జగన్ బలహీన వర్గాలకు పదవులను ఇస్తున్నారని తెలిపారు. జగన్ అబద్ధాలు చెప్పరని, ఏదైనా ముక్కుసూటిగానే చెపుతారని అన్నారు. ఐఫోన్ నుంచి ఐఫోన్ కు వెళ్లే కాల్ రికార్డ్ కాదని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. జగన్ కు నమ్మకం తప్ప అనుమానాలు ఉండవని చెప్పారు. జగన్ బీఫామ్ ఇస్తానంటే నెల్లూరు జనం క్యూ కడతారని అన్నారు.

Kodali Nani
Jagan
YSRCP
Chandrababu
Kotamreddy Sridhar Reddy
Telugudesam
  • Loading...

More Telugu News