Samantha: 'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్!

Shakunthalam lyrical song release

  • సమంత ప్రధాన పాత్రధారిగా 'శాకుంతలం'
  • దర్శక నిర్మాతగా వ్యవహరించిన గుణశేఖర్ 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న మణిశర్మ సంగీతం
  • ఈ నెల 17వ తేదీన సినిమా రిలీజ్  

సమంత అభిమానులంతా ఇప్పుడు 'శాకుంతలం' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో పాటను వదులుతూ వస్తున్నారు. తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు.

'ఏలేలో ఏలేలో ఏలో యాలా .. ఏటీలోన సాగే నావా, ఏలేలో ఏలేలో ఏలో యాలా .. దూరాలేవో చేరే తోవా' అంటూ ఈ పాట సాగుతోంది. శకుంతల తన భర్తను కలుసుకోవడానికి నావలో బయల్దేరి వెళుతున్న సందర్భంలో వచ్చే పాట ఇది. సందర్భానికి తగిన ట్యూన్ లో మణిశర్మ ఈ పాటను చేశారు. 

చైతన్య ప్రసాద్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. 'సీరే కట్టుకొచ్చిందే సందామామా .. సారే పట్టుకొచ్చిందే సందామామా, తుపాను కూడా ఆశల దీపాన్ని ఆర్పలేదు .. కోపాలు శాపాలు కూడా ఏటి కెరటాలను ఆపలేవు వంటి ప్రయోగాలు మనసుకు పట్టుకుంటాయి. బ్లాక్ అండ్ వైట్ వాల్ పెయింట్ మాదిరిగా ఈ పాటను అందించిన తీరు ఆహ్లాదంగా అనిపిస్తోంది. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Samantha
Dev Mohan
Shakunthalam Movie

More Telugu News