Union Budget: కేంద్ర బడ్జెట్ లో ఏపీ, తెలంగాణలకు కేటాయింపుల వివరాలు

Union budget allocations for Telangana and Andhrapradesh
  • 7 అంశాలకు ప్రాధాన్యమిస్తూ వార్షిక బడ్జెట్
  • దేశంలోని ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు
  • బీబీ నగర్, మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రులకు నిధులు
  • విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.683 కోట్లు
  • సింగరేణికి రూ.1,650 కోట్లు కేటాయింపు
కేంద్రం ఇవాళ పార్లమెంటులో 7 అంశాల ప్రాతిపదికగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. వివిధ రంగాలకు కేటాయింపులతో బడ్జెట్ ప్రకటించారు. దేశంలోని ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు ప్రకటించగా, బీబీ నగర్, మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రులు కూడా నిధులు అందుకోనున్నాయి. 

సాలార్ జంగ్ మ్యూజియం సహా అన్ని మ్యూజియంలకు రూ.357 కోట్లు కేటాయించారు. మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ.1,473 కోట్లు కేటాయించారు. ఈసారి కేంద్ర బడ్జెట్ లో విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.683 కోట్లు కేటాయించారు. ఏపీలో పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. 

అటు, సింగరేణికి కేంద్ర బడ్జెట్ లో రూ.1,650 కోట్లు కేటాయించారు. ఐఐటీ హైదరాబాద్ కు ఈఏపీ కింద రూ.300 కోట్లు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లో గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు అందించనున్నారు. 

ఇక, కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.21,470 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ వాటా రూ.41,338 కోట్లు అని బడ్జెట్ లో పేర్కొన్నారు.
Union Budget
Budget 2023-24
Telangana
Andhra Pradesh

More Telugu News