Parvateesham: దిల్ రాజు చేతుల మీదుగా 'తెలుసా మనసా' ఫస్టు లుక్ పోస్టర్ రిలీజ్!

Telusa Manasa Movie Update

  • స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా 'తెలుసా మనసా'
  • పార్వతీశం - జశ్విక జంటగా నటించిన చిత్రం 
  • సంగీతాన్ని సమకూర్చుతున్న గోపీసుందర్ 
  • దర్శకుడిగా వైభవ్ కి ఇది మొదటి సినిమా 

తెలుగు ప్రేక్షకులు ప్రేమకథలను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. మంచి ఫీల్ వర్కౌట్ చేస్తే భారీ హిట్ ను తీసుకొచ్చి మేకర్స్ దోసిట్లో పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కంటెంట్ కనెక్ట్ అయితే చాలు .. బడ్జెట్ ను కూడా పట్టించుకోకుండా భారీ వసూళ్లను అందిస్తారు. అందువల్లనే తెలుగు తెరపై ప్రేమకథల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. 

అలాంటి ప్రేమకథల్లో ఒకటిగా 'తెలుసా మనసా' సినిమా రూపొందింది. పార్వతీశం - జశ్విక జంటగా నటించిన ఈ సినిమాను వర్ష - మాధవి నిర్మించారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, వైభవ్ దర్శకత్వం వహించాడు. ఇది ఒక స్వచ్ఛమైన .. ప్రతిఫలాపేక్షలేని ప్రేమకథ అంటూ మేకర్స్ మరింత ఆసక్తిని పెంచారు. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి దిల్ రాజు చేతుల మీదుగా ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. హీరో ఫ్యామిలీ ఏదో విషయంపై ఆలోచిస్తూ దిగాలుగా కూర్చోవడం ఈ పోస్టర్లో కనిపిస్తోంది. రోహిణి హట్టంగిడి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..

Parvateesham
Dil Raju
Telusa Manasa Movie
  • Loading...

More Telugu News