Sundeep Kishan: టాలెంట్ ఉన్న సందీప్ కిషన్ కి అదృష్టం తోడుకావాలి: నాని

Michael Movie Pre Release Event

  • హైదరాబాదులో జరిగిన 'మైఖేల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • చీఫ్ గెస్టుగా హాజరైన హీరో నాని
  • ట్రైలర్ మాదిరిగా సినిమా ఉంటే హిట్ ఖాయమని వ్యాఖ్య
  • 'శివ' మాదిరిగా 'మైఖేల్' ట్రెండ్ సృష్టిస్తుందని వెల్లడి

సందీప్ కిషన్ - దివ్యాన్ష జంటగా రూపొందిన 'మైఖేల్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన నాని మాట్లాడుతూ .. "మా సినిమాలు వచ్చేవరకూ ఆగకుండా .. ఇలా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఫంక్షన్స్ కి రాకపోతే, ఈలలు .. సౌండ్స్ .. ఎఫెక్షన్ మిస్ అవుతుంటానని అనిపిస్తూ ఉంటుంది" అన్నాడు. 

'మైఖేల్' విషయానికి వస్తే .. ఈ సినిమాలోని ఆర్టిస్టుల గెటప్పులు .. కాస్ట్యూమ్స్ .. పెర్ఫార్మెన్స్ చూస్తుంటే, ఏదో ఒక కొత్త ఒరవడి మొదలవుతుందని మాత్రం అనిపిస్తోంది. 'శివ' వచ్చినప్పుడు అన్ని అంశాల్లో చాలా కొత్తగా అనిపించింది. అలాంటి ఒక సినిమాగా 'మైఖేల్' నిలవాలని నేను కోరుకుంటున్నాను" అన్నాడు.

"టీజర్లో .. ట్రైలర్లో ఉన్న ఎనర్జీ సినిమాలో ఉంటే ఈ సినిమాను భుజాలపై మోయడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. సందీప్ కిషన్ లో ఇంతకాలంగా కష్టం .. టాలెంట్ కనిపించాయి. అదృష్టం మాత్రం కనిపించలేదు. అదృష్టమనేది ఈ సినిమాతో యాడ్ అవుతుందని నేను భావిస్తున్నాను. దివ్యాన్ష చాలా గ్లామరస్ గా కనిపించింది. కొత్త టోన్ తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

Sundeep Kishan
Divyansha
Vijay Sethupathi
Michael Movie
  • Loading...

More Telugu News