Tirumala: తిరుమల కొండపై తగ్గిన భక్తుల రద్దీ
- తిరుమలకు సాధారణ స్థాయిలో భక్తుల రాక
- నేడు రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు
- సర్వదర్శనానికి 8 గంటల సమయం
- నిన్న ఒక్కరోజే స్వామివారికి రూ.4.08 కోట్ల ఆదాయం
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల కొండపై భక్తుల రద్దీ తగ్గింది. ఇవాళ తిరుమలలో టికెట్ లేకుండా సర్వదర్శనానికి భక్తులు రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టికెట్ లేని సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,242 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.08 కోట్ల ఆదాయం లభించింది. 25,862 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.