Tammineni Sitaram: సైకిల్ గుర్తు కాదు.. పీనుగు గుర్తు పెట్టుకోండి: తమ్మినేని

Tammineni Sitaram comments on Chandrababu

  • చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అన్న తమ్మినేని
  • ఎక్కడ సభ పెడితే అక్కడ జనాలు చచ్చిపోతున్నారని విమర్శ
  • జగన్ పాలనలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్కడ మీటింగులు పెడితే అక్కడ జనాలు చచ్చిపోతున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తును తీసేసి... పీనుగు గుర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో పింఛన్ల కోసం అధికారులు, ఆ పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేదని... జగన్ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. 

కళింగ సామాజికవర్గానికి చెందిన వారంతా తమకు ప్రాధాన్యతను ఇచ్చే పార్టీ వైపు రావాలని అన్నారు. కళింగులకు ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లను జగన్ కేటాయించారని చెప్పారు. విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానాన్ని కళింగులకు కేటాయించాలని, కానీ అది జరగడం లేదని అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన కళింగ ఆత్మీయ కుటుంబ కలయిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tammineni Sitaram
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Kalinga
  • Loading...

More Telugu News