Mahesh Babu: మహేశ్ మూవీ కోసం ఐశ్వర్యరాయ్ ను దింపుతున్న త్రివిక్రమ్?

Mahesh and Trivikram movie update

  • తన 28వ సినిమాతో బిజీగా మహేశ్ బాబు 
  • ఆయన జోడీగా అలరించనున్న పూజ హెగ్డే
  • ముఖ్యమైన పాత్రలో మెరవనున్న శ్రీలీల 
  • నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో ఐశ్వర్య రాయ్

మహేశ్ బాబు తన కెరియర్ లో 28వ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. హారిక అండ్ హాసిని బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. పొలిటికల్ టచ్ తో ఈ కథ నడుస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే కనిపించనుంది. మరో ముఖ్యమైన పాత్రలో శ్రీలీల అలరించనుంది. 

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ తన సినిమాల్లోని కీలకమైన పాత్రలని సీనియర్ హీరోయిన్స్ తో చేయిస్తుంటారు. అలా ఆయన నదియా .. ఖుష్బూ .. స్నేహ .. టబు వంటివారిని రంగంలోకి దింపారు. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ పేరు వినిపిస్తోంది. 

ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ పాత్ర నెగెటివ్ షేడ్స్ ను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం వల్లనే ఆమెను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. ఆల్రెడీ 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో ఐశ్వర్యరాయ్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించింది. సెకండ్ పార్టులో ఆమె విలనిజంపై ఎక్కువ ఫోకస్ ఉండనుంది. మరి మహేశ్ మూవీలో త్రివిక్రమ్ ఆమెను ఎలా చూపిస్తాడో చూడాలి.

More Telugu News