Pooja Hegde: వైభవంగా నటి పూజాహెగ్డే సోదరుడి వివాహం.. ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉందంటూ పోస్ట్!

- శివానీ శెట్టిని వివాహం చేసుకున్న రిషభ్ హెగ్డే
- పెళ్లి వేడుక ప్రారంభమైనప్పటి నుంచీ సంతోషంగా ఉన్నానన్న నటి
- ఆనందబాష్పాలు రాల్చానంటూ ట్వీట్
టాలీవుడ్ ప్రముఖ నటి పూజాహెగ్డే సోదరుడు రిషభ్ హెగ్డే ఓ ఇంటివాడయ్యాడు. శివానీ శెట్టిని ఆయన వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆమె అభిమానులతో షేర్ చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను పంచుకున్నారు. తన సోదరుడి పెళ్లి వేడుక ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. చిన్న పిల్లలా నవ్వేశానని, ఆనందబాష్పాలు రాల్చానని అన్నారు.


