Tammineni Sitaram: కళింగులు తమకు ప్రాధాన్యతనిచ్చే పార్టీ వైపు అడుగులు వేయాలి: స్పీకర్ తమ్మినేని సీతారాం

Tammineni Sitharam attends Kalinga family meeting in Visakha
  • విశాఖలో కళింగ ఆత్మీయ కుటుంబ కలయిక
  • హాజరైన స్పీకర్ తమ్మినేని
  • విశాఖ నార్త్ స్థానం కళింగులకు ఇవ్వాలన్న స్పీకర్
  • కానీ అలా జరగట్లేదని వెల్లడి
విశాఖపట్నంలో నిర్వహించిన కళింగ ఆత్మీయ కుటుంబ కలయిక కార్యక్రమానికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళింగులు తమకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ వైపు అడుగులు వేయాలని సూచించారు. 

విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానం కళింగులకు ఇవ్వాలని... కానీ అలా జరగట్లేదని అన్నారు. ఇక, తెలంగాణలో కళింగులకు రిజర్వేషన్ ఇబ్బంది వచ్చిందని, అక్కడ బీసీ-ఏ జాబితా నుంచి కళింగులను తొలగించారని తమ్మినేని వెల్లడించారు. కళింగులను బీసీ-ఏ నుంచి తొలగించడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడానని తెలిపారు. కళింగులకు రిజర్వేషన్ పై పోరాటం చేస్తామని అన్నారు. 

ఏపీలో సీఎం జగన్ కళింగులకు ఒక ఎంపీ స్థానం, రెండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు.
Tammineni Sitaram
Kalinga
Visakhapatnam
YSRCP
Andhra Pradesh

More Telugu News