Kerala governor: మీరు నన్ను హిందూ అని ఎందుకు పిలవకూడదు: కేరళ గవర్నర్ ఖాన్

You must call me a Hindu Kerala governor Arif Mohammed Khan

  • భారత్ లో జన్మించి, ఇక్కడి ఆహారం, నీరు తాగే ప్రతి ఒక్కరూ హిందువేనన్న ఖాన్
  • కనుక తనను సైతం హిందూ అని పిలవాలని పిలుపు
  • మతాలను బ్రిటిషర్లు చక్కగా ఉపయోగించినట్టు అభిప్రాయం

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మరోసారి విలక్షణతను ప్రదర్శించారు. ‘కేరళ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా’ (కేహెచ్ఎన్ఏ) తిరువనంతపురంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ.. విద్యా రంగ సంస్కరణవాది, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అయిన సయ్యద్ అహ్మద్ ఖాన్ మాటలను గుర్తు చేశారు. ‘మీరు నన్ను హిందూ అని పిలవాలి’ అంటూ ఆర్యసమాజ్ సమావేశంలో భాగంగా సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇచ్చిన పిలుపును ప్రస్తావించారు. 

‘‘మీ విషయంలో (ఆర్యసమాజ్) నా తీవ్రమైన ఫిర్యాదు ఏమిటంటే.. మీరు నన్ను హిందూ అని ఎందుకు పిలవకూడదు? హిందూ అనేది మతపరమైన పదమని నేను అనుకోవడం లేదు. హిందూ అనేది భౌగోళికపరమైన పదం. భారత్ లో జన్మించిన వారు ఎవరైనా, భారత్ లో ఉత్పత్తయ్యే ఆహారంతో జీవించే వారు ఎవరైనా? భారత్ లోని నదీ జలాలను తాగే వారు ఎవరైనా సే వారిని వారు హిందూ అని పిలుచుకునేందుకు అర్హులు. కనుక మీరు నన్ను హిందూ అని పిలవాలి’’ అని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. 

హిందూ, ముస్లిం, సిఖ్ పదాలను బ్రిటిషర్లు చక్కగా ఉపయోగించుకున్నారని.. మత ప్రాతిపదికన సాధారణ పౌర హక్కులను నిర్ణయించే వారని పేర్కొన్నారు. స్వాతంత్య్రానికి ముందు పాలించిన రాజులు, పాలకులు సమతా ధర్మాన్ని అనుసరించి అన్ని మతాల వారిని ఆదరించినట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News