Rajinikanth: అనుమతి లేకుండా నా పేరు వాడితే చర్యలు: రజనీకాంత్ హెచ్చరిక

Rajinikanth issues notice warning criminal proceedings against exploitation of his personality

  • పేరు, మాటలు, ఫొటోలను వాణిజ్యపరంగా వాడితే చట్టపరమైన చర్యలు
  • రజనీకాంత్ న్యాయవాది ఎలంభారతి బహిరంగ నోటీసు
  • ఆయనకున్న గౌరవం, అభిమానం సాటిలేనిదని స్పష్టీకరణ

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. రజనీకాంత్ పేరు, ఫొటో, మాటలు లేదా ఆయనకు సంబంధించిన విలక్షణతలు, ప్రత్యేకతలను వినియోగించడం ద్వారా.. వ్యక్తిత్వం, సెలబ్రిటీ హక్కులను ఉల్లంఘించినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నటుడి తరఫు న్యాయవాది ఎస్ ఎలంభారతి పబ్లిక్ నోటీసు విడుదల చేశారు.

‘‘రజనీకాంత్ ఓ సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. వాణిజ్య పరంగా రజనీకాంత్ వ్యక్తిత్వం, పేరు, మాటలు, ఫొటోలను ఉపయోగించే హక్కులపై ఆయనకే నియంత్రణ ఉంది. కొన్ని వేదికలు, మాధ్యమాలు, ఉత్పత్తుల తయారీదారులు రజనీకాంత్ పేరు, మాటలు, ఫొటోగ్రాఫ్, వ్యంగ్య చిత్రం, నటనకు సంబంధించిన చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజాదరణను పొందుతూ తమ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా లేదా తమ ప్లాట్ ఫామ్ లకు వచ్చే చర్యలకు పాల్పడుతున్నాయి’’అని సదరు నోటీసులో పేర్కొన్నారు. 

‘‘నటుడు, మానవతావాది కావడం, ఆయనకున్న ఆకర్షణతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సూపర్ స్టార్ గా పిలుస్తున్నారు. చలనచిత్ర పరిశ్రమలో ఆయనకున్న గౌరవం, అభిమానుల సంఖ్య సాటిలేనిది. వివాదం లేనిది. ఆయనకున్న ప్రతిష్ఠ లేదా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే  అది నా క్లయింట్ (రజనీకాంత్)కు ఎంతో నష్టం’’అని ఎలంభారతి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News