Chiranjeevi: చిరంజీవిగారు నాకు బ్రదర్ లా కనిపించారు: చరణ్

Waltair Veerayya Success Event

  • 'వాల్తేరు వీరయ్య' సెలబ్రేషన్స్ లో మెరిసిన చరణ్
  • చిరంజీవి గారి ఫంక్షన్ కి చీఫ్ గెస్టులు అవసరం లేదని వ్యాఖ్య  
  • మెగాస్టార్ అభిమానిగానే వచ్చానని వెల్లడి
  • ఆయన కూల్ అయినా, తాము కాదని చెప్పిన చరణ్

చిరంజీవి - బాబీ కాంబినేషన్లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ ఈవెంటును 'వీరయ్య విజయవిహారం' పేరుతో హనుమకొండలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్టుగా వచ్చిన చరణ్ మాట్లాడుతూ .. "నాకు 'రంగస్థలం' వంటి హిట్ ఇచ్చిన నిర్మాతలే, మా నాన్నగారికి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఎంతో ప్యాషన్ తో ఇండస్ట్రీకి రావడం వల్లనే వారికి వరుస విజయాలు సాధ్యమవుతున్నాయి" అన్నాడు. 

"బాబీ గారు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్కినట్టుగా తీశారు. ఈ సినిమాలో చిరంజీవిగారు మా నాన్నగారిలా లేరు .. నాకు బ్రదర్ లా ఉన్నారు. చిరంజీవిగారి ఫంక్షన్ కి చీఫ్ గెస్టులు అవసరం లేదు. నేను కూడా ఆయన అభిమానిగానే నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని వచ్చానంతే. రవితేజ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా నాకు బాగా నచ్చింది. దేవిశ్రీ ఈ సినిమా కోసం మూడు అదిరిపోయే పాటలు ఇచ్చాడు. నా సినిమాకి కూడా మంచి పాటలు ఇవ్వాలని కోరుకుంటున్నాను"అని చెప్పాడు. 

"చిరంజీవిగారు చాలా కూల్ గా ఉంటారని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన కొంచెం బిగించి గట్టిగా మాట్లాడితే ఏమౌతుందా అనేది చాలామందికి తెలియదు. ఆయన కూల్ గా ఉన్నప్పటికీ ఆయన వెనకున్న మేమంతా కూల్ గా ఉండం. ఇంతటి మెమరబుల్ హిట్ ను 'వాల్తేరు వీరయ్యకి ఇచ్చినందుకు మారోసారి అందరికీ థ్యాంక్యూ చెబుతున్నాను" అంటూ ముగించాడు. .

Chiranjeevi
Charan
Bobby
WaltairVeerayya Movir
  • Loading...

More Telugu News