Prabhas: మంత్రి కేటీఆర్ కు అభినందనలు: ప్రభాస్

Prabhas appreciates KTR and Green Ko

  • ఫిబ్రవరి 11న హైదరాబాదులో ఫార్ములా-ఈ
  • ఈ రేసు హైదరాబాద్ వచ్చేందుకు కేటీఆర్ ఎంతో కృషి చేశారన్న ప్రభాస్
  • ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ వీడియో సందేశం

ఫార్ములా-ఈ రేసుకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. గ్రీన్ కో హైదరాబాద్ గ్రాండ్ ప్రీ ఫిబ్రవరి 11న జరగనుంది. దీనిపై టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ స్పందించారు. ఈ రేసు హైదరాబాద్ కు వచ్చేందుకు మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేశారని, ఆయనకు, తెలంగాణ ప్రభుత్వానికి, గ్రీన్ కో సీఈవో అనిల్ చలంశెట్టికి అభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. 

తొలిసారిగా ఫార్ములా-ఈ రేసు నిర్వహించడం ద్వారా వాతావరణ మార్పులపై భారత్ తన వైఖరిని చాటిచెప్పే అవకాశం లభించిందని అన్నారు. "ఫిబ్రవరి 11న హైదరాబాద్ నగరం అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్స్ పై తనదైన ముద్ర వేయనుంది. గ్రీన్ కో హైదరాబాద్ గ్రాండ్ ప్రీ రేసులో అన్నీ ఎలక్ట్రిక్ కార్లే పాల్గొంటాయి. సుస్థిర భవిష్యత్తు కోసం భారత్ వేస్తున్న కీలక అడుగు ఈ ఫార్ములా" అని ప్రభాస్ వివరించారు. ఈ మేరకు ఆయన ఇన్ స్టాగ్రామ్ లో వీడియో విడుదల చేశారు.

Prabhas
KTR
Green Ko
Formula-E
Hderabad Grand Prix
  • Loading...

More Telugu News