Manthena Satyanarayana Raju: తారకరత్న ఆరోగ్యంపైనా నీచ రాజకీయాలు చేస్తారా?: రోజాపై మంతెన ఫైర్

TDP MLC Mantena fires in YCP leader

  • లోకేశ్ పాదయాత్రపై రోజా సెటైర్లు
  • లోకేశ్ ది ఐరన్ లెగ్ అని వెల్లడి
  • అందుకే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని వ్యాఖ్యలు
  • రోజాకు డ్యాన్సులు, బూతులు తప్ప ఏం తెలుసన్న మంతెన

నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన నేపథ్యంలో ఏపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ మండిపడ్డారు. లోకేశ్ పాదయాత్ర పోస్టర్ రిలీజ్ చేస్తే 8 మంది చనిపోయారని, కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభిస్తే తారకరత్నకు గుండెపోటు వచ్చిందని రోజా వ్యాఖ్యానించారు. లోకేశ్ ఐరన్ లెగ్ సైకో అని, ఇప్పుడు రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. 

దీనిపై ఎమ్మెల్సీ మంతెన ఘాటుగా స్పందించారు. డ్యాన్సులు, బూతులు తప్ప మంత్రి రోజాకు ఏం తెలుసని ప్రశ్నించారు. తారకరత్న ఆరోగ్యంపై వైసీపీ నీచ రాజకీయాలు సిగ్గుచేటు అని పేర్కొన్నారు. బాబాయ్ ని చంపినవారికి ఇలాంటి క్షుద్ర రాజకీయాలు కొత్త కాదని అన్నారు. లోకేశ్ పాదయాత్రపై వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Manthena Satyanarayana Raju
TDP
MLC
Roja
Tarakaratna
Nara Lokesh
Yuvagalam
Padayatra
  • Loading...

More Telugu News