Avinash Reddy: హైదరాబాదులోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ అవినాశ్ రెడ్డి... విచారణ ప్రారంభం

MP Avinash Reddy arrives CBI Office in Hyderabad
  • 2019లో వివేకా హత్య
  • దర్యాప్తు కొనసాగిస్తున్న సీబీఐ
  • ఇటీవల కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి నోటీసులు 
  • న్యాయవాదితో కలిసి వచ్చిన అవినాశ్ 
వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ నిమిత్తం కడప ఎంపీ అవినాశ్ రెడ్డి హైదరాబాదులోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. తన న్యాయవాదితో కలిసి వచ్చిన అవినాశ్ రెడ్డి నేరుగా కార్యాలయంలోకి వెళ్లిపోయారు. వివేకా హత్యకేసులో అవినాశ్ రెడ్డిని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ బృందం ప్రశ్నిస్తోంది. ఈ కేసులో అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు రావడం ఇదే తొలిసారి. 

వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఇప్పటికే 248 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు. ఆయా వాంగ్మూలాల ఆధారంగానే సీబీఐ అధికారులు అవినాశ్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. తమ నేతను విచారిస్తున్న నేపథ్యంలో, కోఠిలోని సీబీఐ కార్యాలయం వద్దకు అవినాశ్ రెడ్డి అనుచరులు భారీగా తరలివచ్చారు.
Avinash Reddy
CBI
YS Vivekananda Reddy
Hyderabad
YSRCP
Andhra Pradesh

More Telugu News