London: లండన్ లో ఇంటి అద్దె నెలకు రూ.2.5 లక్షలు

Average Rent Hits A Record Rs 250000 Per Month In London
  • లండన్ లో రికార్డు స్థాయికి పెరిగిన అద్దెలు
  • నగరం నడిబొడ్డున ఉన్న ఇంటికి నెలకు రూ. 3 లక్షలు చెల్లించాల్సిందే..
  • అద్దె విపరీతంగా పెంచేసిన ఇంటి యజమానులు
  • ఇప్పటికే పెరిగిన విద్యుత్ చార్జీలతో సతమతమవుతున్న ప్రజలు
బ్రిటన్ రాజధాని లండన్ లో అద్దె ఇంట్లో ఉంటున్న వారు గగ్గోలు పెడుతున్నారు. ఇంటద్దెలు భారీగా పెరిగిపోయాయని, సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయని వాపోతున్నారు. రాజధానిలో సాధారణంగానే అద్దెలు ఎక్కువ అని, ప్రస్తుతం ఇంటి యజమానులు అద్దెను విపరీతంగా పెంచేశారని చెబుతున్నారు. ఒక్కో ఇంటికి ప్రస్తుతం రూ. 2.50 లక్షలు చెబుతున్నారని తెలిపారు. పెరుగుతున్న ధరలతో లండన్ లో సామాన్యుడు నివసించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెరగగా ఇంటద్దె పెంపుతో మధ్యతరగతి ప్రజలకు కష్టాలు తప్పట్లేదని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. టెలిగ్రాఫ్ డైలీ కథనం ప్రకారం.. లండన్ లో కిందటేడాది చివరి నాలుగు నెలల్లో ఇళ్ల అద్దెలు సగటున రూ. 2.50 లక్షలకు చేరాయి. లండన్ నడిబొడ్డున ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే నెలనెలా రూ. 3 లక్షలు చెల్లించాల్సిందేనని ఈ రిపోర్టు వెల్లడించింది. ధరలు ఈ స్థాయికి పెరగడం చరిత్రలోనే ఇదే తొలిసారి అని వివరించింది.
London
Room rent
renters crisis
record price
2.5 lakh per month

More Telugu News