pathaan: మూడు రోజుల్లోనే 'పఠాన్' వసూళ్లు 300 కోట్లు!

Pathaan movie collected Rs 300 crore worldwide till Day 3
  • ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న షారుఖ్ కొత్త సినిమా
  • భారత్ లో ఇప్పటి వరకు రూ.157 కోట్లు రాబట్టిన పఠాన్
  • బాలీవుడ్ బాద్ షా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటున్న విశ్లేషకులు 
బాలీవుడ్ బాద్ షా కొత్త సినిమా పఠాన్ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు రాబట్టింది. షారుఖ్ ఖాన్ కు ఈ సినిమా సూపర్ హిట్ గా మారనుందని సినీపండితులు అంచనా వేస్తున్నారు. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న తన అభిమానులకు షారుఖ్ విందుభోజనంలాంటి సినిమాను అందించారని చెబుతున్నారు. 

ఈ నెల 25న విడుదలైన పఠాన్ సినిమా బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తోంది. అంచనాలను మించి వసూళ్లను రాబడుతోంది. రెండో రోజే ఈ సినిమా 150 కోట్ల క్లబ్ లో చేరగా.. మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయిలను వసూలు చేసింది. భారత దేశంలో మూడో రోజు పఠాన్ వసూళ్లు రూ.34 నుంచి రూ.36 కోట్ల వరకు ఉంటాయని ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా చెప్పారు. ఈ మూడు రోజుల్లో దేశం మొత్తం మీద ఈ సినిమా వసూలు చేసిన మొత్తం రూ.157 కోట్లు అని తెలిపారు.
pathaan
collections
day 3
worldwide
sharukh khan
badsha
Bollywood

More Telugu News