Rakshith Atloori: ‘శశివదనే’ నుంచి ఆకట్టుకుంటున్న ప్రోమో!

Sasivadane Movie Update

  • మరో ప్రేమకథా చిత్రంగా 'శశివదనే'
  • కోనసీమ నేపథ్యంలో సాగే కథ
  • ఫిబ్రవరి 1వ తేదీన పూర్తి సాంగ్ రిలీజ్ 
  • త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన

యువ హీరో ర‌క్షిత్ అట్లూరి హీరోగా .. కోమ‌లి ప్ర‌సాద్ హీరోయిన్‌గా రూపొందిన ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామా ‘శశివదనే’. గోదావ‌రి నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. అహితేజ బెల్లంకొండ నిర్మించిన ఈ సినిమాకి, సాయి మోహ‌న్ ఉబ్బ‌న ద‌ర్శ‌క‌త్వం వహించాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది. ప్ర‌వీణ్ యండ‌మూరి .. త‌మిళ న‌టుడు శ్రీమాన్‌ .. క‌న్న‌డ న‌టుడు దీప‌క్ ప్రిన్స్‌.. ముఖ్యమైన పాత్ర‌ల్లో న‌టించారు. 

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. 'శశివదనే .. శశివదనే నువ్వుంటే చాలుగా' అంటూ ఈ పాట మొదలవుతోంది. ప్రోమోను గమనిస్తే .. కోమలి ప్రసాద్ తులసి చెట్టుకు దండం పెట్టుకుంటూ ఉంటుంది. తన ప్రేమికుడు ఇంటి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడ‌ని తెలియ‌గానే ఆనందంతో మేడపైకి ప‌రుగులు తీస్తుంది. ప్రోమో చాలా నేచుర‌ల్‌గా .. క‌ల‌ర్‌ఫుల్‌గా ఆక‌ట్టుకుంటోంది. 

హ‌రి చ‌ర‌ణ్ .. చిన్మ‌యి శ్రీపాద పాడిన ఈ యూత్ ను దృష్టిలో పెట్టుకుని ట్యూన్ చేసిందే. శ్ర‌వ‌ణ వాసుదేవ‌న్ అందించిన సంగీతం చాలా క్యూట్‌గా ఉంది. కిట్టు విస్సాప్ర‌గ‌డ సాహిత్యం మనసుకు పట్టుకునేలా ఉన్నాయి. పూర్తి టైటిల్ సాంగ్‌ను ఫిబ్ర‌వ‌రి 1న రిలీజ్ చేయనున్నారు. కోన‌సీమ‌ ప్రాంతంలో 50 రోజుల‌కు పైగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను ఆడియన్స్ నుంచి ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.

Rakshith Atloori
Komali Prasad

More Telugu News