Ashritha Vemuganti: సుహాసినిగారిని అలా చూసి ఆశ్చర్యపోయాను: ఆశ్రిత వేముగంటి

Ashritha Vemuganti Interview

  • 'బాహుబలి 2'లో మెరిసిన ఆశ్రిత వేముగంటి 
  •  మరింత పేరు తెచ్చిపెట్టిన 'యాత్ర' 
  • పూర్తిగా సినిమాల వైపు రాలేదన్న ఆశ్రిత
  • సుహాసినితో పరిచయం గురించిన ప్రస్తావన  

ఆశ్రిత వేముగంటి అనే పేరు వినగానే 'బాహుబలి 2' సినిమాలో 'కన్నా నిదురించరా' అనే పాటలో అనుష్కతో కలిసి తళుక్కున మెరిసిన అందమైన రూపం కళ్లముందు కదలాడుతుంది. అప్పటి నుంచే ఆమె ఎవరన్నది తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని చూపించడం మొదలుపెట్టారు. ఆమెకి భరతనాట్యంలో ప్రావీణ్యం ఉందని తెలియడంతో, అందుకనే అంత బాగా డాన్స్ చేసిందని అనుకున్నారు.  

తాజా ఇంటర్వ్యూలో ఆశ్రిత మాట్లాడుతూ .. 'బాహుబలి 2' తరువాత చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ నేను పూర్తిస్థాయిలో సినిమాల్లోకి రావాలని ఇంకా అనుకోకపోవడం వలన, అంగీకరించలేదు. పాత్ర బాగా నచ్చడం వలన. 'యాత్ర' సినిమా చేశాను. మమ్ముట్టి - సుహాసిని వంటి సీనియర్ స్టార్స్ తో కలిసి నటించడం మరిచిపోలేని అనుభూతి" అని అన్నారు. 

ఇక సినిమా షూటింగులో సుహాసిని గారి సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోయాను. ఎన్నో సినిమాలు చేసి .. ఎంతో క్రేజ్ ఉన్న ఆమె అంత సింపుల్ గా ఉండటం .. కూల్ గా ఉండటం చూసి అదెలా సాధ్యమని అడిగాను. తాను సక్సెస్ ను తలకెక్కించుకోననీ, ప్రతి సినిమా కోసం ఒక స్టూడెంట్ లానే కష్టపడతానని ఆమె చెప్పిన మాటలు నాకు బాగా నచ్చాయి" అని చెప్పుకొచ్చారు.

Ashritha Vemuganti
Actress
Tollywood
  • Loading...

More Telugu News