Nandamuri Taraka Ratna: తారకరత్న ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న చంద్రబాబు

Chandrababu speaking to Balakrishna and doctors to know about Taraka Ratna health condition

  • గుండె పోటుకు గురైన తారకరత్న
  • యాంజియోగ్రామ్ నిర్వహించిన డాక్టర్లు
  • ఆసుపత్రిలోనే ఉన్న బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి

సినీ నటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. నారా లోకేశ్ పాదయాత్రలో నడుస్తూ ఉండగా... ఆయన గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. ఆయనకు వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉన్నారు. మరోవైపు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయన మామ, టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు బాలకృష్ణతో పాటు డాక్టర్లతో ఫోన్ లో మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆసుపత్రిలో బాలకృష్ణతో పాటు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు.

More Telugu News