Tollywood: శర్వానంద్ నిశ్చితార్ధానికి జంటగా వచ్చిన సిద్ధార్థ్, అదితీరావు పెళ్లిపై చర్చ

Siddharth Aditi Rao Hydari attend Sharwanands engagement
  • సిద్ధార్థ్, అదితీరావు ప్రేమలో ఉన్నారంటూ కొన్నాళ్లుగా వార్తలు
  • నిన్న హైదరాబాద్ లో రక్షిత రెడ్డితో శర్వా ఎంగేజ్ మెంట్
  • హాజరైన పలువురు ప్రముఖులు 
టాలీవుడ్ హీరో శర్వానంద్, రక్షిత రెడ్డి నిశ్చితార్ధం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో సిద్ధార్థ్, అదితీరావు హైదరీ కూడా ఉన్నారు. ఈ ఇద్దరూ జంటగా కలిసొచ్చి శర్వాకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సిద్ధార్థ్, అదితి ప్రేమలో ఉన్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి రావడంతో వాటికి బలం చేకూరినట్టయింది.

'మహా సముద్రం' సినిమాలో ఈ ఇద్దరూ శర్వాతో కలిసి నటించారు. ఆ సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని పలువురు చెబుతున్నారు. గతేడాది అదితీరావు పుట్టిన రోజు సందర్భంగా సిద్ధార్థ్ 'ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్' అంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలపాడు. ఈ మధ్య అన్ స్టాపబుల్ షోలో వీరి ప్రేమ గురించి బాలకృష్ణ.. శర్వాను అడిగారు. ఇప్పుడు శర్వా ఎంగేజ్ మెంట్ కు కలిసి వచ్చిన సిద్ధార్థ్, అదితి జంట బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Tollywood
hero
Siddharth
Aditi Rao Hydari
love

More Telugu News