Nara Lokesh: మామయ్య బాలయ్యతో కలిసి లోకేశ్ పూజలు.. మూహూర్త సమయానికి ప్రారంభమైన పాదయాత్ర

Nara Lokesh offers prayers to Lord Varadaraja Swamy

  • వరదరాజ స్వామి ఆలయంలో ప్రార్థనలు నిర్వహించిన లోకేశ్, బాలయ్య
  • 11.03 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర
  • వేలాది మంది కార్యకర్తలతో కొనసాగుతున్న యాత్ర 

ఏపీ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమయింది. టీడీపీ యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమయింది. అంతకు ముందు కుప్పం సమీపంలో ఉన్న లక్ష్మీపురంలో శ్రీవరదరాజ స్వామి ఆలయంలో తన మామయ్య బాలకృష్ణతో కలిసి లోకేశ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 11.03 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. ఆయనతో పాటు బాలకృష్ణ, పలువురు టీడీపీ కీలక నేతలు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు నడుస్తున్నారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగనున్న ఈ సుదీర్ఘ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది.

Nara Lokesh
Balakrishna
Telugudesam
Yuva Galam
Padayatra
  • Loading...

More Telugu News