Shah Rukh Khan: రెండు రోజుల్లోనే రూ. 235 కోట్లతో ‘పఠాన్’ కలెక్షన్ల సునామీ

Shah Rukh Khan Pathan Film Crosses Rs 235 Crore Worldwide
  • బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన చిత్రం
  • రెండో రోజు హిందీలోనే రూ. 70 కోట్ల వసూళ్లు 
  • షారుక్ ఖాన్ ఖాతాలో భారీ హిట్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పఠాన్’ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే రూ. 200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టి ఔరా అనిపిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వచ్చిన ఈ యాక్షన్ సినిమాలో షారుక్ సరసన దీపికా పదుకొణే హీరోయిన్ గా నటించింది. పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలైంది. తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది.

దాంతో తొలిరోజు అత్యధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన బాలీవుడ్‌ సినిమాగా రికార్డు సృష్టించింది. య‌శ్ హీరోగా నటించిన కేజీఎఫ్ -2 తొలి రోజు (53.9 కోట్ల) క‌లెక్ష‌న్స్ రికార్డును అధిగమించింది. బుధ, గురువారాల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా పఠాన్ చిత్రం ఏకంగా రూ. 235 కోట్లు రాబట్టింది. రెండో రోజు కేవలం హిందీలోనే రూ. 70 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. తెలుగు, తమిళంలో 2-3 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Shah Rukh Khan
Pathan
235 Crore
collection

More Telugu News