Uttar Pradesh: కుమారుడి మృతితో ఒంటరైన 28 ఏళ్ల కోడలిని పెళ్లాడిన 70 ఏళ్ల మామ!

Father in law marries daughter in law in uttar pradesh

  • ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఘటన
  • స్థానిక గుడిలో కోడలి నుదుటన సింధూరం దిద్దిన మామ
  • దండలు మార్చుకుని ఒక్కటైన మామ-కోడలు

కుమారుడి మృతితో ఒంటరిగా మారిన కోడలిని ఓ మామ పెళ్లాడాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన కైలాశ్ యాదవ్‌ దంపతులకు నలుగురు సంతానం. అందరూ వివాహాలు చేసుకుని ఎవరికి వారు జీవిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం కైలాశ్ భార్య మృతి చెందింది. కైలాశ్ యాదవ్ బర్హల్‌‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.

మరోవైపు, కొన్నేళ్ల క్రితం కైలాశ్ మూడో కుమారుడు మృతి చెందడంతో అతడి భార్య పూజ (28) ఒంటరిగా మారింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న కైలాశ్ (70) స్థానిక గుడిలో ఆమె నుదుట సింధూరం దిద్ది, పూల దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. ఈ వివాహానికి పూజ తరపు బంధువులు, గ్రామస్థులు హాజరయ్యారు. 

సోషల్ మీడియాలో వార్త వైరల్ అవడంతో విషయం పోలీసులకు తెలిసింది. అయితే, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదని బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ తెలిపారు. ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారంతో కుదిరిన వివాహమని, కాబట్టి తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.

Uttar Pradesh
Gorakhpur
Kailash Yadav
Pooja
  • Loading...

More Telugu News