Somireddy Chandra Mohan Reddy: ఏపీలో రాజ్యాంగం అమలు కావట్లేదు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

Somireddy Fires on AP Govt

  • మూడున్నరేళ్లుగా జగన్, మంత్రులు చెప్పిందే చట్టమైందన్న సోమిరెడ్డి 
  • ఏపీ పరిస్థితి చూసి స్వర్గంలో అంబేద్కర్ బాధపడుతుంటారని విమర్శ
  • ఏపీ ప్రజలు రాజ్యాంగం ప్రకారం బతికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వ్యాఖ్య   

ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. 1950 నుంచి స్వతంత్ర భారత దేశంలో సర్వహక్కులతో రాజ్యాంగం అమలవుతోందని.. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రస్తుతం అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. మూడున్నర ఏళ్లుగా జగన్, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిందే చట్టమైందని ఆరోపించారు.

ఏపీలో పరిస్థితులు చూసి స్వర్గంలో అంబేద్కర్ బాధపడుతుంటారని విమర్శలు చేశారు. ఏపీలో ప్రజలందరూ భారత రాజ్యాంగం ప్రకారం బతికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 74వ గణతంత్ర వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.

Somireddy Chandra Mohan Reddy
Republic Day
tdp
constitution
  • Loading...

More Telugu News