MM Keeravaani: పద్మశ్రీ వరించడంపై కీరవాణి స్పందన ఇదే
- భారత ప్రభుత్వం పురస్కారాన్ని గౌరవంగా భావిస్తున్నానన్న కీరవాణి
- తల్లిదండ్రులు, గురువులకు వందనాలు తెలుపుతూ ట్వీట్
- ఇటీవలే ఆర్ఆర్ఆర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అందుకున్న సంగీత దర్శకుడు
తన స్వరాలతో తెలుగు పాటకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. కేంద్రం నిన్న విడుదల చేసిన పద్మ పురస్కారాల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కీరవాణికి అవకాశం లభించింది. ఆయన సంగీతం అందించిన ఆర్ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించింది. ఆస్కార్ తుది నామినేషనల్స్ లోనూ ఈ పాటకు చోటు దక్కింది.
ఈ క్రమంలో ఆయనకు పద్మశ్రీ లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ పురస్కారంపై కీరవాణి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘భారత ప్రభుత్వం నుంచి పౌర పురస్కారాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులతో పాటు కవితాపు సీతన్న గారి నుంచి కుప్పాల బుల్లిస్వామి నాయుడు గారి వరకు నా గురువులందరికీ గౌరవ వందనాలు తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.